Ravanasura: ఇబ్బందుల్లో అను పాప.. మాస్ మహారాజా కాపాడుతాడా?

ఈ తరం హీరోయిన్స్ నేమ్, ఫేం సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ షో చేసినా, సినిమా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం లేదు. కానీ, కొంత మంది హీరోయిన్స్ కు లక్ వల్లో.. టాలెంట్ వల్లో వెంటనే క్లిక్ అవుతున్నారు. కానీ, అను ఇమ్మాన్యూయల్ ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. సరైన హీరోయిన్ అంటూ ఓ గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోతుంది.

సోషల్ మీడియాలో తన పోస్టులు, సినిమాల్లో పాత్రల్లో విపరీతంగా అందాన్ని ఆరబోసినా, ఈ బ్యూటీకి రావాల్సిన క్రేజ్ రావడం లేదు. ఇప్పటికీ కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయంటే, ఈ బ్యూటీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అను ఇటీవల.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తో ఉర్వశివో.. రాక్షసివో అంటూ ఒక సినిమా చేసింది. ఈ చిత్రంలో చెలరేగిపోయి నటించింది. ఎక్కడ తగ్గకుండా, గ్లామర్ షో చేసింది. లెక్కలేనన్ని లిప్ కిస్ లు ఇచ్చింది. అయినా, అను పరిస్థితి ఏం మారలేదు.

ఈ బ్యూటీ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో రావణాసుర అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అమ్మడు ఆశలన్ని ఇప్పుడు ఈ చిత్రంపైనే ఉన్నాయి. రావణాసురలో అనుఇమ్మాన్యూయల్ కు మంచి పాత్ర వచ్చిందని, ఎక్కువ నిడివి ఉంటుందని టాక్. ఈ చిత్రం హిట్ అయితే, అను కెరీర్ లో చాలా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఒకవేళ సినిమా హిట్ కాలేకపోయినా, ఈమె పాత్రకు మంచి మార్కులు అయినా పడాలి. లేదంటే, అను కెరీర్ ప్రమాదంలో పడినట్టే అని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు