Sandeep Reddy Vanga : యానిమల్ సినిమా మరి అంత వైలెంట్ గా ఉండబోతుందా ?

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెల్సిందే.

అర్జున్ రెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో సందీప్ రెడ్డి వంగ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో ఒకడిగా చేరిపోయారు.

ప్రస్తుతం ఈ యంగ్ డైరక్టర్ యానిమల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రణ్ బీర్ కపూర్, రష్మిక ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్దమవుతుంది.

- Advertisement -

అయితే కాసేపటి క్రితం ఈ సినిమా ప్రి టీజర్ ని మూవీ టీం రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఒక పంజాబీ సాంగ్ తో మొదలై అద్యంతం వైలెన్స్ తో సాగింది. రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో మోస్ట్ వైలెంట్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలోనూ తన మార్క్ ఉండేలా సినిమా రూపొందించినట్టు ప్రి టీజర్ ద్వారా తెల్సుతోంది. అలాగే ఈ సినిమాలో బ్లడ్ షెడ్ మరీ ఎక్కువగా ఉన్నట్టు గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ తో మరియు ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రి టీజర్ తో వ్యక్తమవుతుంది.

ఇక ఈ సినిమాని భద్రకాళి ప్రొడక్షన్ బ్యానర్ మరియు టి సిరీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ తో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ యంగ్ డైరెక్టర్ , యానిమల్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు