Prabhas: ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ డీటెయిల్స్.. అంచనా తప్పింది

ఆది పురుష్ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కుడా విపరీతమైన అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా, కృతి సనన్ సీతగా నటించగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ తో పాటు, పాటలు కూడా ఈ సినిమాపై ఉన్న హైప్ ని డబుల్ చేయగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లారు.

ఇక ఆదిపురుష్ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వాళ్ళు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తంలో దాదాపు 180కోట్లు చెల్లించి పీపుల్స్ మీడియా వాళ్ళు సొంతం చేసుకున్నారని, RRR తర్వాత ఇదే అత్యధిక బిజినెస్ జరిగింది ఈ సినిమాకేనని ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా వచ్చిన అఫిషియల్ బిజినెస్ డిటైల్స్ తో ఇదంతా అబద్ధమని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ కి జరిగిన బిజినెస్ లెక్కలు ఇవే.

నైజాం- 50Cr, సీడెడ్- 17.60Cr, ఉత్తరాంధ్ర- 14.50Cr, ఈస్ట్- 8.80Cr, వెస్ట్-7.20Cr, గుంటూరు-8.60Cr, కృష్ణ 8.50Cr, నెల్లూరు 4.80Cr ఓవరాల్ గా తెలుగు రాష్ట్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్ జరిగింది.

- Advertisement -

ఇక ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ జరిగిన 4వ సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో RRR(191CR), బాహుబలి2(122CR), సాహో(121CR), చిత్రాలు మొదటి మూడు స్తానాల్లో నిలవగా, ఆదిపురుష్(120CR) 4వ స్థానంలో నిలిచింది. ఇక 5వ స్థానంలో ఆచార్య(107CR) నిలిచింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రికార్డులు క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమా నైజాం లో మాత్రం RRR (70CR) తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే ఆదిపురుష్ కి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దానికన్నా తక్కువ బిజినెస్ జరగడానికి రాధే శ్యామ్ డిజాస్టర్ ఇంపాక్ట్ కారణం అని తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ బిజినెస్ ని మొదటి వారమే లేపేయడం ఖాయం అని చెప్పవచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు