Shakunthalam : అంత అమౌంట్ ఇస్తానంటేనే కథ వింటాను అంటున్న సమంత !

స్టార్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సమంతకి కథ వినిపించడానికి వచ్చే నిర్మాతల, డైరెక్టర్ల గుండెల్లో ఆమె రెమ్యునరేషన్ చెప్పి అణుబాంబులు పేలుస్తుందట . సమంత లో వచ్చిన ఈ మార్పుకి ప్రొడ్యూసర్స్ మరియు డైరక్టర్లు షాక్ కి గురై పోతున్నారు.

ఇటీవలనే సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా నిలిచినా విషయం అందరికి తెల్సిందే. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ సమంతలో పెద్ద మార్పునే తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సమంత పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్ కి గురి కాగా, అందులో నుంచి బయటికి రావడానికి వరుస సినిమాలు చేస్తూ పోయింది.

గతంలో గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన సమంత ప్రస్తుతం వస్తున్న సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లలోను నటిస్తూ, స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. అయితే ఈ క్రమంలో సమంత రెమ్యునరేషన్ కి కూడా భారీగా పెంచిందని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాకి గాను సమంత అక్షరాలా 10 కోట్లు డిమాండ్ చేస్తుందట. అంతేకాదు అంత అమౌంట్ ఇస్తానంటేనే కథ చెప్పండి లేదంటే లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. సమంతలో వచ్చిన ఈ రకమైన మార్పుకి ప్రొడ్యూసర్స్ మరియు డైరక్టర్లు ఆమెకి కథ వినిపించడానికే ఆలోచిస్తున్నారట.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఆమెకి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుండటంతో, అలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న సమంత ఈ విధంగా ప్రపర్తిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు