Pawan Kalyan: కొత్త హెయిర్ స్టైల్ ఆ సినిమా కోసమేనా?

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి నాలుగు సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే బ్రో చిత్ర షూటింగ్ పార్ట్ ని దాదాపు పూర్తి చేసిన పవన్, త్వరలోనే హరి హర వీరమల్లు ని కూడా పూర్తి చేయనున్నాడు. ఇక ఈ సినిమాలే గాక మరో రెండు సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ చేస్తూనే, మరోవైపు “ఓజి” సెట్స్ లోను హడావిడి చేస్తున్నాడు.

2024 ఎలక్షన్స్ టైమ్ దగ్గర పడుతుండడంతో వీలైనంత తొందరగా ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేద్దామని చూస్తున్నాడు పీకే. అయితే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ తన డిఫరెంట్ గెటప్ తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ జీన్స్ ప్యాంట్, గ్రే షర్ట్ తో ట్రెండీ డ్రెస్సింగ్ తోనే గాక, మిడిలేజ్ గెటప్ లో మిక్సడ్ సాల్ట్&పెప్పర్ లాగా వైట్ హెయిర్ తో ఉన్నాడు. ఇది చుసిన ఫ్యాన్స్ తో పాటు, ట్రేడ్ విశ్లేషకులు “ఓజి” కి సంబంధించిన లుక్ అని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న నాలుగు చిత్రాల్లో మూడు సినిమాల లుక్స్ వచ్చేసాయి. కాబట్టి మిగిలింది సుజీత్ తో చేస్తున్న “ఓజి” మాత్రమే. పైగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి దాదాపు ఫంక్షన్ అయిపోయాక వచ్చాడు. అంటే షూటింగ్ లొకేషన్ నుండి నేరుగా వచ్చాడని అంచనా వేయొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఓజి లో ఒక గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు, కాబట్టి ఈ లుక్ పవన్ కళ్యాణ్ కి చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఓజి కి సంబంధించిన అప్డేట్ ఏది రావాలన్న అది పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు