Baahubali : ఆ నిర్మాత దగ్గర రూ. 400 కోట్లు అప్పు చేసిన రాజమౌళి..!

ప్రపంచానికి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించిన చిత్రం “బాహుబలి”. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభ.. ప్రభాస్, రాణాల అద్భుతమైన నటన ఇవన్నీ ఈ సినిమాని ది బెస్ట్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచేలా చేశాయి. అంతేకాదు ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం దక్కింది.

ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కించిన రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ను ఎవరు అందుకోలేనంత స్థాయికి తీసుకువెళ్లారు. అయితే ఇదంతా జక్కన్నకు ఊరికనే ఏమీ రాలేదు. ఇందుకోసం ఎంతగానో కష్టపడ్డారు. ఎంతో డబ్బును కూడా ఖర్చు చేశారు. బాహుబలి సినిమాని రూపొందించడానికి చేసిన అప్పు, పడ్డ కష్టాలు ఎవరికీ తెలియవని ఆ సినిమాలో నటించిన నటుడు రానా దగ్గుపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ. 400 కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. “సినిమా చేయడం కోసం నిర్మాతలు అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. నాలుగు సంవత్సరాల క్రితం డబ్బు కావాలంటే 2 ఆప్షన్స్ ఉండేవి. అందులో ఒకటి ఆస్తులను తాకట్టు పెట్టాలి, రెండవది అధిక వడ్డీకి అప్పు తీసుకోవాలి. బాహుబలి సినిమాని రెండు భాగాలుగా తీయడానికి రాజమౌళి చాలా కష్టపడ్డారు.

- Advertisement -

ఈ రెండు భాగాలు కంప్లీట్ చేయడం కోసం రాజమౌళి ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 400 కోట్లు అప్పు తీసుకున్నారు. వాటికి 24% చొప్పున.. అంటే నెలకి 96 కోట్ల రూపాయల వడ్డీ కట్టేవారు. బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయిన తరువాత వచ్చిన డబ్బుతో రాజమౌళి అప్పు మొత్తం తీర్చేశారు. అంత అధిక మొత్తంలో అప్పు చేసి మరి, రిస్క్ చేసి ఈ సినిమా చేశారంటే ఆయన కమిట్మెంట్, ఆ కథ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంటే అలా ముందడుగు వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సినిమా అప్పుడు ఆడకపోయి ఉంటే ఏం జరిగేదో అసలు ఊహించలేం” అని చెప్పుకొచ్చారు రానా దగ్గుబాటి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు