Balakrishna: భగవంత్ కేసరి.. సీనియర్ హీరోల్లో రికార్డు కానీ..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యొక్క ఆఫిషియల్ టీజర్ జూన్10న బాలకృష్ణ బర్త్ డే కానుక గా రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఉదయం 10.19 నిమిషాలకు రిలీజ్ చేసిన టీజర్ 24 గంటల్లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోయింది.

భగవంత్ కేసరి రిలీజ్ అయిన గంటల్లో ఏ రికార్డు క్రియేట్ చేయలేకపోయినా, మెల్లిగా జనాల్లోకి ఎక్కేసి ఎక్స్ లెంట్ హైప్ ని పెంచుకుంది. ఇప్పటి వరకు విడుదలైన 24 గంటల్లో భగవంత్ కేసరి 11.45 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోగా 188k లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇక సీనియర్ హీరోల పరంగా చిరంజీవి పేరిట ఉన్న గాడ్ ఫాదర్(8.71m) టీజర్ వ్యూస్ ని క్రాస్ చేసి భగవంత్ కేసరి రికార్డు సృష్టించింది.

అయితే లైక్స్ పరంగా మాత్రం భగవంత్ కేసరి నిరుత్సాహ పరిచింది. లైక్స్ పరంగా సీనియర్ హీరోల్లో ఆచార్య516Kలైక్స్ తో ఇప్పటికి మొదటి స్థానం లో ఉండగా, బాలయ్య వీరసింహారెడ్డి టీజర్ ని కూడా క్రాస్ చేయలేదు. అయితే రెస్పాన్స్ పరంగా మంచి హైప్ ని దక్కించుకోగా రానున్న రోజుల్లో విడుదలయ్యే ట్రైలర్స్, పాటలతో బాలయ్య ఎలాంటి రికార్డు సృష్టిస్తాడో చూడాలి. ఇక భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు