Pawan kalyan : అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. అంటూ సోషల్ మీడియాలో నాగబాబు ఆకస్తికర పోస్ట్

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉండి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేనకి పార్టీ కి సంబంధించి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం అందరికి తెలిసిందే.
ఇటీవలనే ఆయన గతంలో ప్రొడ్యూసింగ్ చేసిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేసి, ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఎప్పటికప్పుడు తోడుగా ఉంటున్నాడు.

అయితే రీసెంట్ గా నాగబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవలనే నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి, హీరోయిన్ లావణ్య త్రిపాఠికి నిశ్చితార్థం అయిన సంగతి అందరికి తెలిసిందే. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట మొన్న(9/6/23) జరిగిన నిశ్చితార్థంతో ఒక్కటైయ్యారు. కాగా వీళ్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నాగబాబు స్వగృహం లోనే సన్నిహితులు, బంధువుల నడుమ ఘనంగా జరిగింది.

ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ,వైష్ణవ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరై పెళ్ళి కాబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంటకి విషెష్ తెలిపారు.

- Advertisement -

అయితే ఎంగేజ్మెంట్ వేడుకలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిన పవన్ కళ్యాణ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మెగా బ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్ వెనక అడుగులు వేస్తూ ఉన్న ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ చిన్నతనంలో అడుగులు వేయడం నేర్పించాను, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నాను అంటూ కాప్షన్ పెట్టగా.. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు