Waltair veerayya: మైత్రి మూవీ మేకర్స్ చేసిన పనికి ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఇక ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం విశేషం. ఆ నిర్మాణ సంస్థే “మైత్రి మూవీ మేకర్స్”.

టాలీవుడ్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ, సాహసోపేత నిర్ణయంతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసి సక్సెస్ కొట్టింది. అయితే ఇదే అభిమానుల మధ్య చిచ్చును రాజేసింది. దాని మంట మైత్రి మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ వరకు వెళ్తుంది. అసలు విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలైన నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు ఎంతో పగడ్బందీగా పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్లు చేసారు. సినిమాల టీజర్ రిలీజ్ ల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ వరకు సమానంగా అన్ని కేటాయించిన చిత్ర యూనిట్ కొన్ని సార్లు మాత్రం పొరపాట్లు చేసింది.

ఈ రెండు సినిమాల్లో వీర సింహారెడ్డి మిక్సడ్ టాక్ తో యావరేజ్ హిట్ అయ్యి 79కోట్ల షేర్ సాధించి 3 కోట్ల ప్రాఫిట్ సాధించగా, వాల్తేరు వీరయ్య మిక్సడ్ రెస్పాన్స్ తో మెగాస్టార్ కి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి 137 కోట్ల షేర్ సాధించి 48కోట్ల భారీ లాభాల్ని ఆర్జించింది. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చింది. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాకి 50 రోజుల వేడుకను, తాజాగా 100రోజుల వేడుకను బాలయ్య బర్త్ డే రోజు నిర్వహించింది. మెగా ఫ్యాన్స్ కి ఈ విషయంలోనే కోపం వచ్చింది. యావరేజ్ హిట్ అయిన వీరసింహారెడ్డి కి ఇంత హంగామా చేసారు బాగానే ఉంది. మరి అత్యధిక లాభాల్ని సంపాదించి పెట్టిన వాల్తేరు వీరయ్య సినిమాకు 50రోజుల వేడుకని ఎందుకు జరపలేదు అని మెగా ఫ్యాన్స్ నిర్మాతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీర సింహాల రెడ్డి 23 డైరెక్ట్ సెంటర్స్ లో 50రోజులాడగా, వాల్తేరు వీరయ్య 74 సెంటర్లలో డైరెక్ట్ గా 50 రోజులాడింది. మరి ఈ విషయంపై నిర్మాతలు మాట్లాడతారా లేదా అన్నది తెలియదు కానీ, సోషల్ మీడియా లో ఫ్యాన్స్ వార్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు