Ishwarya menon : నిఖిల్ స్పై మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది

కార్తికేయ2 సినిమాతో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ పై రాబోతున్న స్పై సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

కెరీర్ బిగినింగ్ లో చేతికందిన సినిమాలు చేస్తూ పోయిన నిఖిల్, స్వామి రారా సినిమా నుంచి రూట్ మార్చాడు. కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్ముకొని, యూనిక్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులు ముందుకి వస్తున్నాడు. ఇటీవలనే కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న నిఖిల్.  స్పై అనే మరో ఇంట్రారెస్టింగ్ ప్రాజెక్ట్ తో థియేటర్ ల వద్ద సందడి చేయనున్నాడు.

నిఖిల్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన స్పై మూవీ విడుదల తేదీ దగ్గరికి వస్తుండటంతో. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ చేసే పనిలో పడ్డారు మూవీ టీం. వీటిలో భాగంగానే ఈ సినిమాలోని మొదటి పాటని ఈ రోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ తరువాత నిఖిల్ వీర్ సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ది ఇండియా హౌస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు స్వయంభు అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిఖిల్ చేసే అన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవబోతున్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు