Allu Arvind: ఇన్సల్ట్ చేశారు… సురేష్ కొండేటికి చిరంజీవికి సంబంధం లేదు

సంతోషం అనే అవార్డ్స్ వేడుకలో కన్నడిగులను అవమానించారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

సంతోషం మేగజైన్ అధినేత, నిర్మాత, నటుడు అయినా సురేష్ కొండేటి ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ అనే వేడుకలను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 2న గోవాలో ఈ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ వేడుకలో కన్నడ సినిమా ప్రముఖులకు అవమానం జరిగిందంటూ ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. సంతోషం అవార్డుల వేడుక ప్రారంభమైన విధానం బాగానే ఉందని, కానీ దాన్ని ముగించిన తీరే అసలేం బాలేదని శారదా శ్రీనిధి పోస్ట్ చేశారు.

కన్నడ స్టార్ దర్శన్ నటించిన ‘క్రాంతి’ సినిమా, శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ సినిమా బృందాలకు ఒక్కో అవార్డు వచ్చిందని, కానీ ఆ తర్వాత రమేష్ అరవింద్ స్టేజ్ మీదకు వెళ్లగానే లైట్స్ ఆపేసారని, అనంతరం కన్నడ తారలందరినీ వెళ్లిపొమ్మని చెప్పారని ఆమె వివరించారు. ఇక రమేష్ అరవింద్ మాత్రమే కాకుండా సంతోషం అవార్డులకు హాజరైన హీరోయిన్ రాగిణి ద్వేది, ‘కాంతారా’ హీరోయిన్ సప్తమి గౌడ సహా పలువురు సెలబ్రిటీలు సురేష్ కొండేటి తీరుతో ఇబ్బందులు పడాల్సింది వచ్చిందని ఆమె ఫైర్ అయ్యారు.

- Advertisement -

హోటల్ బిల్స్ పే చేయకపోవడంతో వాళ్లకి సంబంధించిన రూమ్స్ ని లాక్ చేశారని, ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ సెలబ్రిటీలంతా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారని, ఈ నేపథ్యంలో హోటల్ ప్రతినిధులు, సెలబ్రిటీల స్టాఫ్ మధ్య గొడవ జరిగిందంటూ ఆమె పోస్ట్ చేసింది. సంతోషం అవార్డులు అంటూ పిలిచి మరీ గోవాలో ఈ విధంగా తమ అభిమాన నటీనటులను అవమానించడం ఏంటంటూ కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ను కూడా కుదిపేస్తోంది. అయితే ఎవరో ఒక వ్యక్తి, లేదా ఒక సంస్థ చేసిన పనికి తెలుగు చిత్ర పరిశ్రమను నిందించడం కరెక్ట్ కాదని తెలుగు ప్రేక్షకులు సర్ది చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఈ వివాదంపై స్పందించారు. అల్లు అరవింద్ సదరు అవార్డ్స్ పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. ఆయన మాట్లాడుతూ ఆ ఫంక్షన్ ప్రైవేటు అని, దానికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అతను చిరంజీవికి పిఆర్ఓ అని చాలా మంది రాస్తున్నారని, కానీ అతను చిరంజీవికి గాని లేదా తమలో ఎవరికి గాని అధికారిక పిఆర్ఓ కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ ఫంక్షన్ ఫెయిల్ అయిందని, కానీ దాని ఎఫెక్ట్ తెలుగు చిత్ర పరిశ్రమ మీద గాని, లేదా పరిశ్రమలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిపై గాని పడదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. దీంతో సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సురేష్ కొండేటికీ తమకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర పరిశ్రమ ఇన్ డైరెక్ట్ గా ప్రకటించినట్టుగా అయ్యింది. ఇన్నాళ్లుగా చిరంజీవి పిఆర్ఓ అని చెప్పుకుంటూ వస్తున్న సురేష్ కొండేటికీ అల్లు అరవింద్ మీడియా వేదికగా చురకలు అంటించారు. మరి ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా? లేదంటే ఇంకేమైనా మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు