Janhvi Kapoor : తన ఇంద్ర భవనాన్ని చూపించిన జాన్వీ… ఖరీదెంతో తెలుసా?

 

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకుంది. “దడక్” అనే తన ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న జాన్వి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా, డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు కెరీర్ బిగినింగ్ లోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సాహసం చేసి డాషింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఒక హోమ్ టూర్ వీడియోను రిలీజ్ చేసింది. ముంబైలో ఉన్న తన ఇంద్ర భవనం లాంటి ఇంటిని చూపిస్తూ జాన్వీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తున్నంత సేపు ఎవరైనా సరే జాన్వి కపూర్ ఇంతటి విలాసవంతమైన ఇంట్లో నివసిస్తుందా అని అబ్బుర పడిపోవడం ఖాయం. వైట్, హ్యాష్ కలర్ పెయింటింగ్స్ తో జాన్వి ఇల్లు చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది. ఇక తన తల్లి జ్ఞాపకాలతో నిండిపోయిన ఈ ఇల్లు అంటే జాన్వి కపూర్ కు చాలా ఇష్టమట.

- Advertisement -

శ్రీదేవి అప్పట్లో తన కష్టార్జితంతో ఈ ఇంటిని ఇష్టంగా కట్టించుకుందట. ఇక ఆ వీడియోలో జాన్వి తో పాటు ఆమె చెల్లి ఖుషి కపూర్, తండ్రి బోణి కపూర్ సరదాగా గడిపిన క్షణాలు కూడా కనిపిస్తున్నారు. ఆ ఇంట్లో ప్రతి మూల శ్రీదేవి టేస్ట్ ఏంటో తెలుస్తోంది. క్లాసిక్ లుక్ తో ఇల్లు మొత్తం చాలా ట్రెడిషనల్ గా ఉంది.  అయితే ఈ ఇంటి ఖరీదు ఏకంగా 30 నుంచి 40 కోట్ల వరకు ఉంటుందట. మొత్తానికి జాన్వి కపూర్ తన హోమ్ టూర్ వీడియోతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక అందాలను ఆరబోయడానికి ఏమాత్రం మొహమాటపడని జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్ కూడా కోట్లలో తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ “దేవర”తో ఎప్పుడెప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుందా అని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు