Bigg Boss 7: బిగ్ బాస్ 7 విజేతకు లభించే బహుమతులు ఇవే…!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఆరు సీజన్ లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ తుది దశకు చేరుకుంది. మొత్తం ఇందులో 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన రీతిలో ఆట ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మరో వైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదు మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఎవరికివారు తమ టాలెంట్ కు తగ్గట్టుగా ఆటలు ఆడి ప్రేక్షకులను మెప్పించారనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉండగా ఇక నిన్న వారం ఎలిమినేషన్ లో భాగంగా గౌతం ఎలిమినేట్ అయ్యారు.

అసలు ఎవరికీ అంతగా తెలియని యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి గౌతమ్ 13 వారాల పాటూ హౌస్ లో ఉన్నాడు అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక నామినేషన్స్ లో ఉన్న ప్రియాంక, శివాజీ , యావర్ సేవ్ అవ్వగా.. చివరికి ప్రశాంత్, శోభ ,గౌతమ్ లు మిగిలారు. ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండడంతో అది వేరే వాళ్ల కోసం ఉపయోగించాలని లేదా తిరిగి ఇచ్చేయాలని నాగార్జున చెప్పడంతో.. చాలాసేపు ఆలోచించుకొని పక్క వాళ్ళు బాగుపడితే నాకేం వస్తుంది అని అనుకున్న ప్రశాంత్ దానిని ఎవరికోసం ఉపయోగించకుండా తిరిగి ఇచ్చేశాడు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ , శోభ సేవ్ అవ్వగా.. గౌతం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక అర్జున్ నామినేషన్ లో ఉండగా టికెట్ టు ఫినాలే అస్త్రాను సొంతం చేసుకొని ఫైనల్ కి చేరుకోవడంతో ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు. ఇక అమర్ ఎలాగో నామినేషన్ లోకి రాలేదు కాబట్టి సేవ్ అయ్యాడు.

ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాయ్ నాన్న మూవీ నుంచి హీరో నాని, నా సామిరంగా సినిమా నుంచి హీరోయిన్ ఆషికా రంగనాథ్ వచ్చి కాసేపు సందడి చేశారు. ఇకపోతే బిగ్ బాస్ లో గెలిచిన వాళ్లకు ఏమేమి వస్తాయి అన్న విషయాన్ని కంటెస్టెంట్స్ కి తెలిపారు నాగార్జున. ఈ సీజన్లో టైటిల్ గెలిచిన వాళ్లకి రూ.50 లక్షలతో పాటు రూ.15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ అలాగే ఒక మారుతి కారును కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు నాగార్జున తెలిపారు. ఇక తర్వాత టైటిల్ గెలిచి ఈ డబ్బు గెలిస్తే ఎవరు ఏం చేస్తారు? అని కంటెస్టెంట్ లని అడగగా..అంతా కూడా ఇల్లు కట్టుకుంటామని.. తల్లిదండ్రుల కోసం అని.. ఇలా రకరకాలుగా చెప్పి హౌస్ లో కాసేపు డ్రామా సృష్టించారు. మొత్తానికైతే గెలిచిన వాళ్లకి రాబోయే బహుమతులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు