Ram gopal Varma: మిగతా దర్శకులకి సందీప్ రెడ్డి వంగా కి ఉన్న తేడా ఇదే

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ దర్శకుడుగా మంచి పేరును సాధించుకున్నాడు. అప్పట్లో శివ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను ఆ రేంజ్ లో మళ్ళీ అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిందంటూ చాలామంది ఆ సినిమాను లేపారు. అదే సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమా తెరకెక్కించాడు. అక్కడ కూడా కబీర్ సింగ్ సినిమా అద్భుతమైన విజయం సాధించి దాదాపు 300 కోట్ల వరకు వసూలు చేసింది.

అయితే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమాను శివ సినిమాతో పోల్చడం వలన వెంటనే రాంగోపాల్ వర్మ కూడా ఎంతో క్యూరియాసిటీతో ఆ సినిమాను చూసి, నేరుగా సందీప్ రెడ్డి వంగని కలిసి కొంతసేపు మాట్లాడి, ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత సందీప్ నుంచి మరో సినిమా రాడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టింది రీసెంట్ గా సందీప్ దర్శకత్వం వహించిన సినిమా అనిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తో మంచి కలెక్షన్లతో ముందుకు పోతుంది.

అనిమల్ సినిమాపై ప్రశంసలు తో పాటు కొద్దిపాటి విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇకపోతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు మిగతా దర్శకులకి సందీప్ రెడ్డి వంగ కి ఉన్న తేడాను తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు రామ్ గోపాల్ వర్మ.

- Advertisement -

మామూలుగా మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ ప్రేక్షకులు తమకంటే చిన్నగా ఆలోచిస్తారని అనుకుంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ప్రేక్షకులంతా ఎగ్జాక్ట్గా తనలాగే ఆలోచిస్తారని అనుకుంటాడు. అందుకే సందీప్ రెడ్డి తీసిన సినిమాలు కి ఆడియన్స్ బ్రహ్మారథం పడతారు అని పరోక్షంగా అర్థమయ్యేలాగా చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ. ఏదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలకి దారితీసిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరైతే, ఇప్పుడున్న జనరేషన్ లో సందీప్ రెడ్డి ఒకరు అనేది కొందరి అభిప్రాయం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు