Allu Arjun: వైజాగ్ నాకెప్పుడూ స్పెషలే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుపేన్నడు కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్.

ఇప్పటికే అన్ని భాషలలో పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన సుకుమార్.. ఇటీవల లొకేషన్ ని విశాఖకు మార్చిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ సహా పుష్ప రాజ్ టీం అంతా విశాఖలో సందడి చేసింది. పార్ట్ 2 సినిమాని వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట సుకుమార్. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ నుంచి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.

- Advertisement -

విశాఖలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ముగిసిందని తెలియజేశారు. అంతేకాదు వైజాక్ తనకెప్పుడూ స్పెషల్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీచ్ లో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు. ఇక రెండవ పార్ట్ తో ఐకాన్ స్టార్ ఎలాంటి రికార్డు కొల్లగొడతాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు