Sid-Kiara : ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కేశారు..

సినిమా రంగంలో పని చేస్తున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్. ఆ ప్రేమ జంటలు పెళ్లితో ఒకటి కావడం వెరీ కామన్. అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య సినిమా ఇండస్ట్రీలో ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో తోటి నటులును పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా చేరిపోయారు.

కియారా, సిద్ధార్థ్ చాలా రోజుల నుంచి ప్రేమలో ఉంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు.. ఈ జంట రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. ముందుగా వీరి లవ్ పై అనేక రూమర్స్ వచ్చాయి. తర్వాత ఈ జంట తమ లవ్ గురించి అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ ప్రేమ జంట పెళ్లి గురించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి ఎక్కడా ? ఎలా జరుగుతుంది ? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీశారు. #SidKiaraWedding అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ట్రెండింగ్ లో చాలా రోజుల పాటు ఉంటుంది.

ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఫైనల్ మంగళవారం ఒకటైంది. ఫిబ్రవరి 07న రాజస్థాన్ లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్ లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల మధ్య ఈ ప్రేమ జంట ఒకటైంది. దీనికి సంబంధించిన ఫోటోలను కియారా, సిద్ధార్థ్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు