Akhil:ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని నట వారసుడు అఖిల్ 2015 లో వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ అనే చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడేళ్లలో అఖిల్ నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా అన్ని కూడా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకున్నాయి. అలాగే ఒకటి అంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. దీంతో ఈ అక్కినేని హీరో ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. గతేడాది డిసెంబర్ లో, ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించింది. కానీ, అప్పుడు బాక్సాఫీస్ వద్ద పోరు ఎక్కువగా ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.

దీంతో ఏజెంట్ రిలీజ్ డేట్ పై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఏజెంట్ ను వేసవి కానుకగా అయినా రిలీజ్ చేస్తారా లేదా మరోసారి వాయిదా వేస్తారా చూడాలి మరి. కాగా ఏజెంట్ ను 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా కలిసి నిర్మిస్తున్నాయి.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు