HBD Nazar: నాజర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటించే నటులలో నాజర్ కూడా ఒకరు.. ఈయన కెరియర్ లో ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందారు.. విలన్ గానే కాకుండా ఇతరత్రా క్యారెక్టర్లలో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ రోజున నాజర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం..

నాజర్ కెరియర్..
నటుడు నాజర్ కెరియర్లో మాతృదేవోభవ సినిమా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించారు.. ముఖ్యంగా దమ్ము సినిమాలో ఈయన చేసిన విలన్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాలలో బిజ్జల దేవా వంటి క్యారెక్టర్లలో నటించి మరింత క్రేజ్ అందుకున్నారు. నాజర్ పోషించిన ప్రతి పాత్ర కూడా చాలా గొప్పగానే ఉంటుందని చెప్పవచ్చు. స్టార్ హీరోల చిత్రాలలో ఏదైనా ఒక క్యారెక్టర్ లో నాజర్ నటిస్తున్నారంటే కచ్చితంగా తన పాత్రకు మంచి పేరు సంపాదించుకునేలా చేస్తూ ఉంటారు.

నాజర్ చిత్రాలు..
ముఖ్యంగా ఆగడు, బాద్షా, దూకుడు వంటి సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఎలాంటి పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారనడంలో సందేహం లేదు..అందుకే సినీ ఇండస్ట్రీలో నాజర్ ను మించిన నటుడు ఎవరూ లేరని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం పలు రకాలుగా సెలెక్టివ్ పాత్రలను చేస్తూ తనకున్న ఇమేజ్ తో తనని తాను బలపరుచుకుంటున్నారు. డైరెక్టర్ బాలచంద్ర ఈయనని మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారట.. మాతృదేవోభవ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

- Advertisement -

ఇతర భాషలలో నాజర్ గుర్తింపు..
నాజర్ తెలుగు, తమిళ్ ,కన్నడ, హిందీ ,ఇంగ్లీష్ వంటి భాషా చిత్రాలలో కూడా నటించారు.. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్, నానాపటేకర్ , కమలహాసన్ వంటి వారితో కూడా కలిసి నటించారు. నటుడుగా ఇండస్ట్రీలోకి రాకముందు నాజర్ తాజ్ కోరమాండల్ హోటల్లో క్యాటరింగ్ లో కూడా పనిచేశారట.. అంతేకాకుండా కొన్ని కథలను కవితలను కూడా మ్యాగజైన్ పేపర్ల కోసం రాసేవారు. దాదాపుగా ఈయన కెరియర్ లో 300కు పైగా సినిమాలలో నటించారు.

మెగాస్టార్ తో అనుబంధం..
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి , నాజర్ ఇద్దరూ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో క్లాస్మేట్స్ గా ఉండేవారట.. అంతేకాకుండా నాజర్ యాక్టింగ్ లో మాస్టర్ డిప్లమా చేసి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. నాజర్ పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. నాజర్ తండ్రి కూడా నాటకాలు వేస్తూ ఉండేవారు.. అలాగే పాత నగల కి మెరుగులు దిద్దుతూ.. అలా వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని గడిపే వారట.. నాజర్ కి ఒక సోదరి , ముగ్గురు సోదరులు ఉన్నారు.. నాజర్ కమలాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.. నాజర్ కమలా దంపతులకు ముగ్గురు కుమారులు కూడా.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు