Sri Ranga Neethulu : ఆ సినిమా వల్ల.. ఈ సినిమా స్క్రిప్ట్ ఛేంజ్ చేసే ఆలోచనలో మేకర్స్..

టాలీవుడ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోలు గా ఎదిగిన టాలెంటెడ్ నటులు సుహాస్, విరాజ్ అశ్విన్, అలాగే కార్తీక్ రత్నం. వైవిధ్య‌మైన పాత్రలతో టాలీవుడ్ లో త‌మ‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు ఈ హీరోలు. అయితే ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ఈ సినిమా చాలా రోజుల నుండి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మధ్యనే జనవరి చివరి వారంలో షూటింగ్ పూర్తవడం జరిగింది. ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజుల నుండి మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ లో ఛేంజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం మరో సినిమా అని టాక్ నడుస్తుంది.

ఆ సినిమాల ఫలితం వల్ల..

సుహాస్, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో అలాగే రుహానిశ‌ర్మ‌ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న సినిమా శ్రీ రంగ నీతులు సినిమాలో మెయిన్ లీడ్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో గోల్ ఉంటుంది. వాటిని అందుకోడానికి ఏం చేశారనే ఈ సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్ లో చూపించారు. ఇక శ్రీ‌రంగనీతులు సినిమాను ప్ర‌వీణ్‌కుమార్ VSS ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోల పాత్రల విషయంలో కొన్ని చేంజెస్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. దానికి కారణం ఇందులో నటిస్తున్న హీరోల గత సినిమాల ఫలితాలని బట్టి ఈ రకంగా డిసైడ్ అయ్యారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ హీరోగా నటిస్తున్న విరాజ్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన జోరుగా హుషారుగా సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయి ప్లాప్ అయింది. అలాగే మరో హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయి మంచి హిట్ అయింది.

- Advertisement -

రీ షూట్ వల్ల నిర్మాతకే నష్టం?
అయితే ఫలితాల వల్ల రాబోయే శ్రీరంగ నీతులు లో విరాజ్ పాత్ర నిడివి కాస్త తగ్గించి, సుహాస్ పాత్ర ని డెవలప్ చేసేలా స్క్రిప్ట్ చేయమని, అవసరమైతే మళ్ళీ రీ షూట్ చేయమని నిర్మాత దర్శకుడ్ని సూచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కార్తీక్ రత్నం రుహాణి శర్మ పాత్రలు మాత్రం అలాగే ఉంటాయట. అయితే ఈ వార్త పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆ మాటలెలా ఉన్నా, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం సినిమాల పలితాలతో ఇలా ఆలోచించకూడదని, అయినా ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన సినిమాను మళ్ళీ రీ షూట్ చేస్తే, సినిమా ఆ స్క్రిప్ట్ ఛేంజెస్ వల్లే ప్లాప్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక శ్రీ రంగ నీతులు ఈ చిత్రానికి హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ వార్తలపై ఎంత నిజముందో చిత్ర యూనిట్ నుండే క్లారిటీ రావాలి. అయితే సినిమా రిలీజ్ డేట్ మాత్రం పెద్ద సినిమాల పోటీ వల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. బహుశా ఏప్రిల్ లో ఏదైనా ఒక డేట్ కి సోలో రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు