SSMB29: మహేష్ బాబుతో 8 గెటప్స్… జక్కన్న చెక్కడం మామూలుగా ఉండదు మరి

ఏడాది సంక్రాంతి సందర్భంగా… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. కానీ, రిలీజ్ అయ్యాక స్టార్టింగ్‌‌లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మహేష్ తన నెక్స్ట్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేస్తున్న అని అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది.

SSMB29 నుంచి అప్డేట్ ఇదే…
ప్రస్తుతం SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఈ సినిమా పైన ఎన్నో రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో వైరల్ గా మారుతోంది. ఈ విషయం విని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. SSMB29 చిత్రంలో మహేష్ బాబు 8 గెటప్పులలో కనిపించబోతున్నారట. ముఖ్యంగా రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలలో హీరో గెటప్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే హీరోలు కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అందుకు కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఏకంగా 8 గెటప్ లలో…
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కి గెటప్‌ల అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 గెటప్పులను ఇప్పటికే ఖరారు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. SSMB29 కి సంబంధించి గెటప్స్ విషయంలో ఏది రివీల్ కాలేదు. అందుకు రాజమౌళి కూడా కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ పబ్లిక్ లో ఎక్కువగా కనిపించకూడదని రాజమౌళి కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో అభిమానులు కాస్త నిరాశతో ఉన్నారు.

- Advertisement -

జక్కన్న కండీషన్స్… 
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా లేదా పలు యాడ్స్ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంటారు మహేష్. కానీ రాజమౌళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు మహేష్ బాబును ఎక్కడ కనిపించవద్దని రాజమౌళి పెట్టిన కండిషన్ వల్ల అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే కచ్చితంగా హీరోల దగ్గర నుంచి నాలుగు లేదా ఐదు ఏళ్ల వరకు కాల్ షీట్లు తీసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నేళ్లు సినిమా తీస్తారు అంటూ అభిమానులు కలవర పడుతున్నారు.. ఈ చిత్రంలో హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మహేష్ బాబు ఎనిమిది గెటప్లలో కనిపిస్తున్నారని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు