Aadi Pinishetti : ‘శబ్దం’ తో రానున్న ఆది

ఆది పినిశెట్టి కి తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆ పాత్రైనా అలవోకగా నటించె సత్తా ఉన్నవాడవు ఆది. తెలుగులో హీరో కాన విల్లన్ పాత్రలోనే ఎక్కువగా సినిమాలు నటించాడు ఆది. ఆది పినిశెట్టి. సర్రైనోడు, మలుపు, నిన్ను కోరి,అజ్ఞాతవాసి,యు టర్న్, గుడ్ లక్ సఖి,వారియర్ వంటి చిత్రాల్లో సహాయక నటుడి గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు బర్త్ డే బాయ్. తెలుగు తోపటు తమిళంలో తనకు బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టిన మూవీ ‘వైశాలి’ని అందించిన దర్శకుడు అరివళగన్ వెంకటాచలంతో చేతులు కలిపాడు. ఈ చిత్రానికి ‘శబ్దం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ గా కనిపించే ఈ పోస్టర్ను చుస్తే అది హారర్ సినిమాగా రానుందని అర్థమవుతుంది.

హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ కంపోజర్ థమన్ సౌండ్‌ట్రాక్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు