Double Ismart: ఇస్మార్ట్ కాంబో నుండి స్ట్రైకింగ్ అప్డేట్…!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ కొంత గ్యాప్ తీసుకొని అనౌన్స్ చేసిన సినిమా ఇది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరో రామ్ కి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటంతో ఈ కాంబినేషన్ పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో స్కంద సినిమాలో నటిస్తున్న రామ్ త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. తాజాగా ఈ సినిమా గురించి స్ట్రైకింగ్ అప్డేట్ రానుందంటూ సినిమా యూనిట్ తెలిపింది.

జూన్ 10న ఉదయం 11:11 నిమిషాలకు అనౌన్స్మెంట్ ఉంటుందంటూ అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ కోసం హీరో రామ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేదాని గురించి ఈ అప్డేట్ ఉంటుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో రామ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? వంటి అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

లైగర్ సినిమా తర్వాత పూరీ పని అయిపోయిందంటూ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఈ సినిమా ద్వారా హిట్ కొట్టడం కీలకంగా మారింది. మరో పక్క హీరో రామ్ కూడా చాలా కాలంగా హిట్ లేక సతమవుతున్న క్రమంలో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా హిట్ అవ్వటం రామ్ కి కూడా కీలకం అనే చెప్పాలి. మరి, ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబో నుండి మరొక బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు