RT4GM: వివాదాస్పద కథతో మాస్ మహారాజ సినిమా..?

మోస్ట్ సక్సెస్ ఫుల్ మాస్ కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రానుందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనౌన్స్ చేసింది. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సుమారు 30ఏళ్ళ కిందట గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన యదార్ధ సంఘటనకు సంబంధించిన అంశాలు ఈ పోస్టర్లో ఉండటమే ఈ చర్చకు కారణం. అప్పట్లో అప్పట్లో దళితులకు అగ్రవర్ణాలకు జరిగిన ఆధిపత్య పోరులో సుమారు 300మంది అగ్రవర్ణాల వారు 8మంది దళితులను దారుణంగా చంపిన వైనాన్ని ఇప్పటికీ అక్కడి జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అప్పట్లో దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంఘటన ఆధారంగా సినిమా చేయటం అంటే దర్శకుడు గోపీచంద్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. గోపీచంద్ ఇటీవల ప్రతి సినిమాని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. క్రాక్ సినిమా ఒంగోలు రౌడీ షీటర్ కటారి కృష్ణ కథని వాడుకుంటే, వీరసింహారెడ్డి సినిమా కోసం కూడా పురాతన లైబ్రరీలో రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని మరొక యదార్ధ సంఘటన ఆధారంగా సినిమా చేస్తున్నాడన్న వార్తలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. మరో పక్క ఇటీవల రావణాసుర సినిమా ద్వారా డిజాస్టర్ వచ్చినా కూడా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు హీరో రవితేజ. ఇప్పటికే రవితేజ లైన్లో పెట్టిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ప్రామిసింగ్ గా అన్పిస్తున్న నేపథ్యంలో గోపీచంద్ మలినేని సినిమా కథ విషయంలో వినిపిస్తున్న వార్త సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు