Megastar: ప్రోమోకి పాజిటివ్ రెస్పాన్స్ – సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో..?

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా భోళాశంకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్ అంచనాలు అందుకోలేకపోయాయి. రొటీన్ మాస్ మసాలా సినిమాకి రీమేక్ కావటం, ఫామ్ లో లేని మెహర్ రమేష్ డైరెక్టర్ కావటంతో భోళాశంకర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘జామ్ జామ్ జజ్జినక’ సాంగ్ కి సంబంధించిన ప్రోమో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

జూన్ 11న విడుదల కానున్న ఈ సాంగ్ ప్రోమో ఇవాళ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.  సెలెబ్రేషన్ థీమ్ లో రూపొందించిన ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉండబోతోందని అనిపిస్తోంది ప్రోమో చూస్తుంటే. కలర్ ఫుల్ సెట్ లో శహోట్ చేసిన ఈ సాంగ్ లో చిరు, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లు కనిపించనున్నారు. ప్రోమోలో వచ్చిన బీట్ ఆకట్టుకోవడంతో మెగా ఫ్యాన్స్ కోసం ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి మొదటి నుండి పెద్దగా బజ్ లేని భోళాశంకర్ కి ఒక్క ప్రోమోతో పాజిటివ్ వైబ్స్ రావటం పట్ల మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరుకి చెల్లెలి పాత్రలో, సుశాంత్ మరొక కీలక పాత్రలో నటించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి, రీమేక్ అయినందువల్ల పెద్దగా బజ్ క్రియేట్ కాని ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు