Sree Vishnu: శ్రీవిష్ణు స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ‘సామజవరగమన’..!

కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ ద్వారా తన ప్రతిభ చాటుకొని, ఆ తర్వాత హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సాధించాడు హీరో శ్రీవిష్ణు. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన శ్రీవిష్ణు ఇటీవల తనకు కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని పక్కన పెట్టి సీరియస్ కథలతో సినిమా చేసి వరుస ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇటీవల సామజవరగమన సినిమా ద్వారా మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందు వచ్చాడు శ్రీవిష్ణు. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

రిలీజయ్యి రెండు వారాలు అవుతున్నా కూడా మంచి అక్యుపెన్సీతో నడుస్తున్న ఈ సినిమా 30కోట్లకు పైగా గ్రాస్ సాధించి శ్రీవిష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా శ్రీవిష్ణు టైర్2 హీరోగా ప్రమోట్ అయినట్టే అని టాక్ వినిపిస్తోంది. సరైన సినిమా పడితే శ్రీవిష్ణు సినిమాలకు కూడా మంచి వసూళ్లు వస్తాయని సామజవరాగమన సినిమా ద్వారా ప్రూవ్ అయ్యింది.

క్లీన్ కామెడీ తో రూపొందిన ఈ సినిమాలో నరేష్, శ్రీవిష్ణుల మధ్య వచ్చే సీన్స్ కి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వారం కూడా పెద్దగా సినిమాలేవీ లేవు కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మరి, తనకి కలిసొచ్చిన కామెడీ జానర్ తో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈ సినిమా తర్వాత ఎలాంటి కథలతో సినిమాలు చేస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు