Dasara: భోళాతో నాని బేల

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా ఈ నెల (మార్చి 30) న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో పవర్ ఫుల్ మాస్ రోల్ చేస్తున్న నాని ఇప్పటివరకు కనిపించిన లుక్స్ అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, పూర్ణ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు.

కాలా, కబాలి లాంటి చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మార్చి30 న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా అయిదు భాషల్లో రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు హిందీలో మాత్రం ఒక సమస్య అడ్డు పడుతుంది.

హిందీలో ఇదే రోజు అనగా మార్చి30న విడుదలవుతున్న సినిమా భోళా. తమిళ్ హిట్ సినిమా ఖైదీ ని రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ని అజయ్ దేవగన్ స్వయంగా నటించి నిర్మించాడు. విశేషం ఏంటంటే అజయ్ దేవగన్ ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. కాగా రెండు సినిమాలకు థియేటర్లను సరిగ్గా పంచట్లేదని దసరా నిర్మాత అంటున్నారు. ముందుగా 1000 థియేటర్లలో రిలీజ్ కి ప్లాన్ చేసినా 500 థియేటర్లు మాత్రమే దొరకడంతో దసరా నిర్మాత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం భోళా సినిమాను చూడ్డానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే ఖైదీ రీమేక్ ని చాలా మార్పులు చేసాడని తెలిసిపోతుంది. ఈ సినిమా ఏ మాత్రం బెడిసికొట్టినా ఈ థియేటర్లలో దసరా ని భర్తీ చేయవచ్చు. ఈ రెండింటి రిజల్ట్ తెలియాలంటే మార్చి30 వరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు