Kiran,Aadi: ఆడిన సినిమా లేదు.. అవకాశాలకు ఢోకా లేదు

సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరోకు అయినా హిట్లు చాల ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ లో సక్సెస్ శాతం చాల తక్కువ. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. వారసత్వం నుంచి వచ్చినా అది కొంత వరకే నిలబెడుతుంది. ఆ తర్వాత వారి టాలెంట్ ద్వారా మాత్రమే నిలబడగలరు. ఇండస్ట్రీ లో వారసత్వం తో నెట్టుకొస్తున్న హీరోలు ఎక్కువ మంది ఉన్నా, తమ టాలెంట్ ని నమ్ముకొని సొంతంగా ఎదిగిన హీరోలూ ఉన్నారు. అయితే టాలెంట్ ఉన్నా వారసత్వంతో వచ్చినా కొంతమందికి హిట్లు రావడం లేదు. వారిలో ఆది సాయికుమార్ గురించి ముందుగా చెప్పుకోవాలి.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో ప్రేమ కావాలి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమా తోనే మంచి మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత లవ్లీ తో మరో హిట్ కొట్టగా సుకుమారుడు యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత నుండి మాత్రం స్క్రిప్ట్ సెలక్షన్ చేతకాకో, కాలం కలిసిరాకో వరుస పరాజయాలు వెంటాడాయి. ఇప్పటి వరకు 16 ప్లాప్ అయ్యాయి. ఒకప్పుడు నితిన్ కి కూడా ఇలాగే ప్లాప్స్ పడ్డాయి. కానీ ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి కొంతకాలం ఆఫర్స్ వచ్చాయి. ఇష్క్ సినిమాతో సక్సెస్ బాట పట్టాడు. కానీ ఆది కి మాత్రం వారసత్వం, టాలెంట్ ఈ రెండూ ఉన్నా కలిసి రావడం లేదు. సాయికుమార్ లాగే ఆదికి సింగల్ టేక్ లో డైలాగ్ చెప్పే సత్తా ఉన్నా స్క్రిప్ట్ సెలెక్షన్స్ అంతగా బాగా లేదు.

అలాగే ఇండస్ట్రీ కి నాని, రవితేజ లాగా సొంత టాలెంట్ ని నమ్ముకొని వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. ఇతను కూడా మంచి టాలెంట్ ఉండి వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాసక్సెస్ మాత్రం పడటం లేదు. రాజావారు రాణి వారు అనే చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం S.R కల్యాణ మండపం తో మొదటి హిట్ ఇచ్చాడు. అయితే తర్వాత మాత్రం ఏ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాలు ప్లాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ బ్రేక్ ఈవెన్ అయినా లాభాలు మాత్రం తీసుకురాలేదు. అయినా సరే మంచి ఆఫర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.

- Advertisement -

సి.స్.ఐ సనాతన్, కిరాతక సినిమాలతో ఆది, మీటర్ తో కిరణ్ అబ్బవరం థియేటర్స్ లోకి రాబోతున్నారు. ఈ సినిమాల ద్వారా వీళ్లిద్దరు హిట్ కొడతారో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు