RC15: ఛేంజర్ కాదు.. డేంజర్

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RC15 అప్డేట్ రోజు రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఖుషి చేద్దామని RC15 టీం అనుకుంది. దిల్ రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా రామ్ చరణ్ ను ఎప్పుడూ చేడలేని లుక్ లో చూపిస్తున్నామని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ మరింత అంచనాలు పెట్టుకున్నారు. SSMB28 లుక్ కూడా ఆదివారం రావడంతో, దాన్ని బీట్ చేసేలా తమ హీరో లుక్ ఉంటుందని చరణ్ ఫ్యాన్స్ అనుకున్నారు.

ఈ రోజు ఉదయం RC15 టైటిల్ గేమ్ ఛేంజర్ అంటూ రిలీజ్ చేశారు. ఇది కాస్త నిరాశ పరిచినా, కాసేపటి క్రితం మూవీలోని రామ్ చరణ్ లుక్ ను విడుదల చేశారు. అది కూడా మెగా అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఫ్యాన్ మేడ్ పోస్టర్… పోస్టర్ లో చరణ్ గుర్తుపట్టలేకపోతున్నాం.. అంటూ కామెంట్స్ స్వయంగా చరణ్ ఫ్యాన్స్ నుంచే వస్తున్నాయి. అలాగే ఈ లుక్ ఇప్పటికే బ్రూస్ లీ మూవీలో చరణ్ ఇదే లుక్ లో కనిపించారని కూడా అంటున్నారు. ఇక కొంత మంది అయితే గేమ్ ఛేంజర్ పోస్టర్ లో కన్నడ హీరో యష్ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాదు.. బైక్ యష్ పై కూర్చున్న ఓ ఫోటో పక్కన రామ్ చరణ్ కొత్త పోస్టర్ ను పెట్టి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే, కొంత మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే, గేమ్ ఛేంజర్ లో చరణ్ లుక్ సూపర్ స్టైలీష్ గా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ కొత్తగా ఉందంటూ తమ హీరోకు మద్దతు ఇస్తున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాలున్న RC15కి ఇలాంటి టాక్ రావడం ఫ్యాన్స్ కు నిరాశ అనే చెప్పేవారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు