Devara : ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకొని బ్రతిమాలిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

ఇండస్ట్రీలో సినిమా సినిమాకు తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ లో భావోద్వేగాలను పలికించడంలో, ఫైట్స్, డాన్సులలో తనదైన మార్క్ చూపించడంలో జూనియర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి. ఇదే ఆయనకు కోట్లాదిమంది అభిమానుల ఆదరాభిమానాలు దక్కేలా చేసింది. కేవలం తన కళ్ళతోనే హావభావాలను పలికించగల నటుడు అంటూ ఎన్టీఆర్ ని కొనియాడుతుంటారు దర్శక నిర్మాతలు.

ఇక ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత స్టార్ హీరో అయినప్పటికి చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు. తోటి నటులతోనైనా, అభిమానులతోనైనా స్నేహభావంతో ఉంటాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్నాడట. ఈ విషయాన్ని ఆ సీనియర్ నటి స్వయంగా ఓ ఇంటర్యులో వెల్లడించింది.

ఆమె మరెవరో కాదు నటి సుధ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వెల్లడించింది. బాద్షా సినిమా చేస్తున్న సమయంలో ఆడవాళ్ళతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ చేసే సీన్ అందరం చూశాం. ఈ సీన్ లో సీనియర్ ఆర్టిస్ట్ సుధా తో కలిసి ఎన్టీఆర్ డాన్స్ చేస్తారు. ఆ సమయంలో ఆమె కాల్ స్లిప్ అయిందట.

- Advertisement -

దీంతో వెంటనే ఎన్టీఆర్ ఆమె కాలు పట్టుకొని ఏం కాలేదమ్మా అంటూ వెంటనే స్ప్రే తెప్పించి కాలుకు స్ప్రే చేశారట. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా తన కాలు పట్టుకొని అమ్మ అంటూ ఎంతో బాగా చూసుకున్నారని సుధా చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఆమె గుర్తు చేసుకొని ఎన్టీఆర్ చాలా మంచివాడు అంటూ చెప్పుకొచ్చింది సుధ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు