Megafans: బాబాయ్ అలా.. అబ్బాయ్ ఇలా.. రెస్పాన్స్ ఏది?

టాలీవుడ్ లో అందరు టాప్ హీరోలు స్టార్ హీరోలు తెగ బిజీ గా ఉన్నారు. వీళ్ళు నటిస్తున్న సినిమాలు వరుస బెట్టి రెగ్యులర్ షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో బిజీ గా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ దేవర సెట్స్ లో బిజీ గా ఉన్నాడు. అటు ఆదిపురుష్ విడుదలైన తర్వాత ప్రభాస్ కూడా గ్యాప్ తీసుకోకుండా సలార్ సెట్స్ లో అడుగుపెట్టాడు. ఇక అల్లు అర్జున్ గురించి తెలిసిందే. ఏడాది నుండి పుష్ప 2 సెట్స్ లోనే బిజీగా ఉన్నాడు. వీళ్లే గాక సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ సినిమాల షూటింగుల్లో బిజీ గా ఉండి ఎప్పటికప్పుడు తమ సినిమాల అప్డేట్ లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు.

కానీ ఇద్దరు హీరోల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వాళ్ళే మెగా వారసులు, బాబాయ్ అబ్బాయి అయిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ మొన్నటివరకు తన సినిమాలతో బిజీ గా ఉన్నా ఇప్పుడు రాజకీయ ప్రచారంలో బిజీ అయ్యాడు. తాను నటించిన బ్రో షూట్ పూర్తయినా, ఇంకా మూడు సినిమాలు అలాగే సెట్స్ పై ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుతున్నా ఆ సెట్స్ లో పవన్ అడుగుపెట్టడం లేదు. మరి ఆ సినిమాల్లో పవన్ పాల్గొంటాడో లేదో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీనికి సంబంధించి నిర్మాతలు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. బ్రో మినహా వేరే సినిమాల అప్డేట్ రావడం లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే దిల్ రాజు మీద చాలా ఫైర్ అవుతున్నారు. ఎప్పుడో మూడు నెలల కిందట వచ్చిన ఒక్క పోస్టర్ తప్ప ఇప్పటివరకు గేమ్ చేంజర్ నుండి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. పైగా సినిమా ఇప్పటివరకు 80 శాతంపూర్తయిందని నిర్మాత అన్నాడు. మరి అదే నిజమైతే గేమ్ ఛేంజర్ కి సంబంధించి కనీసం ఒక్క పాటయినా రిలీజ్ చెయ్యమని ఫ్యాన్స్ అంటున్నారు. కొంత మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే దిల్ రాజు కి సంబంధిచిన అన్ని సోషల్ మీడియా పేజీల్లో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇది గమనిస్తే వీళ్ళ సినిమాల ప్రొడ్యూసర్లు ఇప్పటికైనా ఆ హీరోలకి సంబంధించిన అప్డేట్ లపై రెస్పాన్స్ అవుతారా లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు