Prabhas: ఆదిపురుష్ సినిమాపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ ఇటీవలనే రిలీజై ఎంతగా వివాదాస్పందం అవుతుందో అందరికి తెలిసిందే.ముందు నుంచి రామాయణ ఇతిహాసం ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తున్నామని చెప్పిన ఆదిపురుష్ మూవీ టీం సినిమాపై వస్తోన్న నెగిటివిటీ చూసి అసలు మేము తీసింది రామాయణమే కాదని ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు అందరు చూస్తూనే ఉన్నారు.

ఇక ఈ సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్ మీసం దగ్గరి నుండి మొదలైన వివాదాలు రావణుడి పది తలల ప్లేస్మెంట్ వరకు ప్రతి విషయం గురించి సోషల్ మీడియా వేదికగా రోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని అందరికి అర్థమయ్యేలా తీస్తున్నామని చెప్పి హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలలో ఉన్న గెటప్ లన్నీ కాపీ చేసాడని ట్విట్టర్ లో వీడియోలతో సహా బయటికి వస్తున్నాయి.

ఈ క్రమంలో గతంలో జూనియర్ ఎన్టీఆర్ రావణుడి పై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమా గురించి అందరికి తెలిసిందే. కే.ఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి అందరిని మెప్పించాడు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో జై అనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, రావణుడి క్యారెక్టర్ కి దగ్గరగా ఉండే పాత్ర పోషించాడు. అయితే ఈ పాత్రకోసం గాను ఆయన రావణుడి గురించి రీసర్చ్ చేసి ఆయన గురించి చాలా విషయాలు తెలుకున్నాడట, ఆయన ఎలా ఉండేవాడు, ఎలా చూసేవాడు, ఎలా నడిచేవాడు అనే విషయాలన్నిటి గురించి చదివి, వాటిని ఆకళింపు చేసుకొని జై పాత్రలో నటించి, ప్రేక్షకులందరిని మెప్పించాడు.

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాపై నెగిటివిటీ వస్తోన్న నేపథ్యంలో ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కాగా అందరు ఈ వీడియోని షేర్ చేస్తూ, ఆదిపురుష్ టీం కి కనీసం ఎన్టీఆర్ కి ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదని కామెంట్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు