Mama mascheendra: మహేష్ బాబుతో కొట్టించుకోవడం ఎందుకు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో కొట్టించుకోవడం ఆ హీరో ఏమాత్రం ఇష్టం లేదట.. ఇంతకీ ఎవరా హీరో.. ఏంటసలు మ్యాటర్ అనుకుంటున్నారా..

సుధీర్ బాబు హీరోగా.. ప్రముఖ యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మామా మశ్చీంద్ర. ఈ సినిమాలో మొదటిసారి హీరో సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడు. మూడు విభిన్న పాత్రలలో ఆయన కనిపించబోతున్నాడు. సుధీర్ బాబుకు జోడిగా ఇషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

చాలా రోజుల క్రిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ అవడానికి రెడీ అయింది. ఇక నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మహేష్ బాబు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

ఇండస్ట్రీలో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఆ తరువాత నుంచి హీరోగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఎంచుకుంటున్న కథల దృష్ట్యా సుధీర్ బాబు కెరీర్ ఆశించినంత సక్సెస్ ఫుల్ గా లేదనే చెప్పాలి. తెలుగులో హీరోగా చేస్తూనే ఆ మధ్య సుధీర్ బాబు బాలీవుడ్ లో వర్షం రీమేక్ గా వచ్చిన భాగీ అనే సినిమా విలన్ గా కూడా నటించారు. ఇక మామా మశ్చీంద్ర సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ విషయమై మీడియా ప్రతినిధి మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయవలసి వస్తే చేస్తారా అని ఆయనను అడగగా సుధీర్ బాబు రీప్లే ఇచ్చాడు.

స్క్రీన్ పైన అయిన రియల్ లైఫ్ లో ఆయిన మహేష్ ను హేట్ చేయడం తన వల్ల కాదని, అలాగే మహేష్ చేతిలో తన్నులు తినడం కూడా తాను చేయలేనని చెప్పాడు. అయితే సుధీర్ ఈ విధంగా చెబుతూనే ఒకవేళ చేయవలసి వస్తే చేస్తాను కాని అది తన మనసుకు నచ్చదు అని చెప్పుకొచ్చాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు