Salmankhan: టైగర్ ఊపిరి ఉన్నంత వరకు ఓటమిని ఒప్పుకోడు..! దివాళికి వచ్చేస్తున్నాడు…

Salmankhan:

బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు చాలా రెగ్యులర్ గా వస్తాయన్న సంగతి తెలిసిందే. ధూమ్ సిరీస్, సింగం సిరీస్, దబాంగ్ సిరీస్ లాగే ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ వస్తుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన “ఏక్ థా టైగర్” సినిమా గురించి తెలిసిందే. 2012 లో వచ్చిన ఆ సినిమా ఆరోజుల్లోనే 300కోట్లకి పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందులో సల్మాన్ ఖాన్ “టైగర్” అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ గా ఇండియన్ స్పై ఏజెంట్ గా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

దీనికి సీక్వెల్ గా రెండో పార్ట్ 2017లో “టైగర్ జిందా హై” రాగా అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 500కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించింది. ఇక ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడానికి మళ్ళీ వచ్చేస్తున్నాడు టైగర్.

టైగర్ సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న సినిమా “టైగర్3”. మహేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా తెగ ఆడేస్తున్నాయి. మొన్న బ్రహ్మాస్త్ర, పఠాన్, నేడు జవాన్.. అందుకే టైగర్3 మూవీ కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక మొదటి రెండు పార్ట్స్ లో టైగర్ ఏజెంట్ గా కనిపించగా, ఈ మూడో పార్ట్ లో దేశ ద్రోహి అని ముద్రపడిన ఏజెంట్ గా చూపిస్తున్నారు. అనుకోకుండా పడిన ఆ నిందని టైగర్ ఎలా ఎదుర్కున్నాడు. తన ఫ్యామిలీ పరువును ఎలా కాపాడాడు? అనేది ఈ స్టోరీ. టీజర్ మొత్తం సల్మాన్ ఖాన్ డైలాగ్స్ తో నిండిపోగా, చివర్లో చెప్పిన డైలాగ్ సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. టైగర్ శ్వాస ఉన్నంత వరకు ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు… ఈ డైలాగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయం.

- Advertisement -

ఇక టీజర్ ఖ్వాలిటీ రిచ్ గా ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆశించినంత గా లేదు. ఇక కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ టీజర్ లో తెలిసిపోయింది గనుక కథ విషయంలో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ కథని స్క్రీన్ ప్లే తో ఎలా మ్యాజిక్ చేస్తాడన్నదే ప్రశ్న.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు