Nithya Menon: కుమారి శ్రీమతి.. తనకింకా పెళ్ళికాలేదు?

Nithya Menon:

టాలీవుడ్ లో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసే హీరోయిన్లలో ముందుండేది నిత్యా మీనన్. ముందు నుండి కథా బలం ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించే ఈ భామ, తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అదే “శ్రీమతి కుమారి”. టైటిల్ వినడానికి క్యాచీ గా ఉండగా, ఈ వెబ్ సిరీస్ ని ఒక కామెడీ డ్రామాగా తీర్చిదిద్దారు. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

ట్రైలర్ లో శ్రీమతి కుమారి గా నిత్యా మీనన్ ని పరిచయం చేయగా, ట్రైలర్ మొత్తం ఎంటెర్టైన్మెంట్ తో కొన్ని ఎమోషన్స్ తో నింపేసాడు. ఇటికెలపూడి గ్రామానికి చెందిన కుమారి తన తాత కట్టించిన వాళ్ళ సొంత ఇంటిని, వాళ్ళ బాబాయ్ అక్రమంగా లాక్కుంటాడు. తిరిగి తన సొంత ఇంటిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో కుమారి బార్ బిజినెస్ చెయ్యాలని చూస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ అమ్మ కుమారి పెళ్లి గురించి ఎన్నో సంబంధాలు తీసుకొచ్చినా రిజెక్ట్ చేస్తుంది. ఫైనల్ గా కుమారి తాను అనుకున్నది సాధించిందా? బార్ బిజినెస్ పెట్టిందా? తమ సొంత ఇంటిని కాపాడుకుందా? అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

- Advertisement -

ఇక ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగగా, కెమరా వర్క్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ని గోమ్ టేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీ బ్యానర్ లో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. నటుడు దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాడు. నిరూపమ్ పరిటాల, తిరువీర్, గౌతమి, ప్రేమ్ సాగర్, ప్రణీత పట్నాయక్, తాళ్లూరి రామేశ్వరి, మురళి మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమాలో పాత తరం నటులు తాళ్లూరి రామేశ్వరి, బాబు మోహన్ లాంటి నటులు చాలా ఏళ్ళ తరువాత నటించడం ఆడియన్స్ కి సంతోషాన్నిచ్చింది. ఇక శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రముఖ ఒటిటి ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్28 నుండి ప్రసారం అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు