Pedakaapu: ఎలివేషనా? కంటెంటా? రెండింట్లో ఏది గెలుస్తుంది?

Pedakaapu:

టాలీవుడ్ లో సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన “సలార్” వాయిదా పడడంతో ఆ ప్లేస్ ని భర్తీ చేసేందుకు ఎన్నో మూవీస్ కర్చీఫ్ వేశారు. ఫైనల్ గా ఆ రోజు రెండు మీడియం రేంజ్ మూవీస్, రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలపైనే ఆడియన్స్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అందులో ఒకటి రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న “స్కంద” ఒకటి కాగా, మరొకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “పెదకాపు” సినిమా.

ఈ రెండు మాస్ జోనర్ సినిమాలే అయినా, స్కంద మాత్రం హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వస్తుంది. నిజానికి బోయపాటి సినిమాల్లో పెద్దగా కథ ఉండదన్న విషయం తెలిసిందే, ఉన్నదున్నట్టు చెప్పాలంటే హీరోకు రెండు ముఖాలు, నాలుగు పాటలు, పది ఎలివేషన్ ఫైట్ సీన్లు, పెద్ద ఫ్యామిలీ, హీరో ముందు తేలిపోయే బలమైన విలన్.. అంతే.. రీసెంట్ గా రిలీజ్ అయిన స్కంద ట్రైలర్ లో ఉంది.

ఇక ఇటు పెదకాపు సినిమా విషయానికొస్తే ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా రోజుల తర్వాత తన డైరెక్షన్ లో కొత్తదనాన్ని చూపిస్తూ, ఫ్యామిలీ మూవీ కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ లో కంటెంట్ ఉన్న మాస్ సినిమాతో వస్తున్నాడు. కొత్త హీరో విక్రాంత్ కర్ణ హీరోగా నటిస్తుండడంతో ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోగా, ఫస్ట్ లుక్ మొదలుకొని మెల్లిగా టీజర్, ట్రైలర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అన్నిటికి మించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలే ఈ సినిమాలో స్వయంగా విలన్ గా నటించడం విశేషం. ఇక పెదకాపు లో కథ అందరికీ తెలిసిందే అయినా, దాన్ని డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే ద్వారా ఇంట్రెస్టింగ్ గా మలచాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.

- Advertisement -

ఇక మిగతా రెండు మూడు డబ్బింగ్ సినిమాలు చంద్రముఖి2, ది వాక్సిన్ వార్, గాడ్ సినిమాలపై మినిమం బజ్ కూడా లేదు. కాబట్టి ఈ సినిమాలు ఆడియన్స్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉన్నాయి. మరి సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న స్కంద, 29న వస్తున్న పెదకాపు లో ఏది ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు