Malavika Mohanan Comments: తలపొగరు కాదు.. సరైన పాత్ర కోసం

Malavika Mohanan Comments

మోడలింగ్ చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అయిన వాళ్ల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అలాంటి వారిలో మలయాళ కుట్టి మాళవిక మోహనన్ కూడా ఒకరు. సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తేగా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ సౌత్ లోనే బెస్ట్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.

చిన్న చిన్న సినిమాలు చేస్తున్న సమయంలో కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన మాస్టర్ మూవీలో ఛాన్స్ వచ్చిన తర్వాత మాళవిక మోహనన్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీని తర్వాత ఒక కోలీవుడ్ లోనే కాదు, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, తన కెరీర్ ను సూపర్ గా ప్లాన్ చేసుకుంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ సినిమా చేస్తుందని టాక్. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న హర్రర్ – థ్రిల్లర్ జానర్ మూవీలో మాళవిక ఓ హీరోయిన్ పాత్ర చేస్తుందని సమాచారం. దీంతో పాటు పా. రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా చేస్తున్న తంగలాన్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

500 కోట్ల బడ్జెట్ ఉన్న మూవీ అయినా సరై తాను చేయలేనని ఇటీవల కామెంట్స్ చేసింది. తనకు భారీ బడ్జెట్ సినిమా ముఖ్యం కాదని, తన పాత్ర నచ్చితేనే చేస్తాను అంటూ ఓ ఇంటర్య్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఈ మలయాళ బ్యూటీపై కొన్ని విమర్శలు వచ్చాయి. “రెండు పాన్ ఇండియా సినిమాలు చేసిందో లేదో.. అప్పుడే తలపొగరు వచ్చేసింది” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే దీనిపై ఆమె ఫ్యాన్స్, క్రిటిక్స్ మరోలా స్పందిస్తున్నారు. మాళవిక మోహనన్ ది తలపొగరు కాదు.. తన కెరీర్ పై ఉన్న ప్లానింగ్ అంటూ చెబుతున్నారు. 500 కోట్ల బడ్జెట్ ఉన్న మూవీ చేసినా, తాను చేసే పాత్రకు గుర్తింపు లేకపోతే, లాభం ఏంటి? చిన్న బడ్జెట్ సినిమా అయినా, పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే కాదా, యాక్టర్ గా గుర్తింపు వచ్చేది అంటూ మాళవిక చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు