Kiara Advani Pregnancy Rumours: ప్రెగ్నెంట్ అయ్యేందుకు సిద్ధమైన కియరా ?

Kiara Advani Pregnancy Rumours

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సుపరిచితమే. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కియారాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తెలుగులో పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో ఆమె బి టౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె గేమ్ చేంజర్ చిత్రంలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ప్రియుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్లో విరి వివాహం జరిగింది.

గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. కానీ కియారాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించండి.

- Advertisement -

2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పింది. ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పే వారే ఉండరని అభిప్రాయపడింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలంది. తాజాగా ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు