Ustaad bhagat singh release date: సంక్రాంతి రేస్ లో పవర్ స్టార్

Ustaad bhagat singh release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ప్లానింగ్ ఏమోగాని సినిమాల ప్లానింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు చేసిన సినిమాల విషయంలో కంటే ఇప్పుడు ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్రో సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ విజయవంతంగా ప్రదర్శించబడుతుండగానే, ఆయన మరో సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి చూస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బ్యాక్ తో బ్యాక్ సినిమాలలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకున్న సినిమా OG, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ డేట్స్ తో సంబంధం లేకుండా సుజీత్ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2 షెడ్యూల్స్ షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. దాంతో ఈ రెండు సినిమాలలో ఎదో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిజిజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నడట పవన్ కళ్యాణ్.

ఇటీవలనే ఆంద్రప్రదేశ్ లోని మంగళగిరిలో డైరెక్టర్ హరీష్ పవన్ కళ్యాణ్ ను కలవగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ రెడీ చేయమని హరీష్ శంకర్ కు చెప్పాడట. అన్ని పనులు రెడీ అయిన వెంటనే తాను షూటింగ్ వస్తానని హామీ కూడా ఇచ్చాడట. దాంతో ఉస్తాద్ తరువాతి షెడ్యూల్ ను ఫిక్స్ చేసే దిశగా హరీష్ శంకర్ పని చేయడం స్టార్ట్ చేసాడు.

- Advertisement -

అయితే OG దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా OG సినిమాను పక్కన పెట్టి ఉస్తాద్ సినిమా కంప్లిట్ చేయడానికి మెయిన్ రీజన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటమే అని టాక్. జనసేనకు ఇప్పుడిప్పుడే మంచి ప్రజాదరణ లభిస్తుండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు