Baby Movie Success Meet: చిరంజీవి దురదృష్టవంతుడు.. తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Baby Movie Success Meet

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబీ. చిన్న సినిమాగా విడుదలైన బేబీ ఏకంగా 75 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా జులై 20వ తేదీన మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని మూవీ యూనిట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఓ దురదృష్టవంతుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది విన్న అందరూ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని కూల్ అయ్యారు. సాయి రాజేష్ మాట్లాడుతూ.. “అన్నయ్య మా జీవితాల గురించి మీకు తెలియదు. ఒక్కసారి మాలాగా బ్రతికి చూడండి. మేము ఎలా ఉంటాం, ఏం చేస్తాం అనేది మీరు చూడలేరు.

చిరంజీవి ఆయనకు ఆయన అభిమానులా ఉండలేరు. ఆయనకు అభిమానిలా ఉండే అదృష్టం ఆయనకు లేనేలేదు. మాకు తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, సంతోషం కలిగినా, బాధ కలిగినా మా మందు ఆయన పాటే” అంటూ చిరంజీవి పై తనకు ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చారు. దీంతో సాయి రాజేష్ వ్యాఖ్యలపై మెగా అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు