PUSHPA 2 Latest Rumour : పుష్ప 2 లో తమిళ్ హీరో సూర్య ?

PUSHPA 2 LATEST RUMOURS

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇక పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో సమంత నటించగా… సునీల్ మరియు అనసూయ కూడా కీలకపాత్రలో కనిపించారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ తరుణంలో… ఈ సినిమా నుంచి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరో క్రేజీ న్యూస్ అందరికీ పిచ్చెక్కిస్తుంది. పుష్ప రెండో భాగంలో తమిళ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ మేరకు ఇప్పటికే… హీరో సూర్యను సుకుమార్ కలిసారట. ఇక ఆ పాత్ర చేసేందుకు సూర్య కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇది ఇలా ఉండగా పుష్ప రెండో భాగంలో హీరోయిన్ శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు గత వారం రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా పుష్ప రెండో భాగం సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తూందట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు