Laal Singh Chaddha : మెగా లాల్ చడ్డా డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో అగ్ర హీరోలు అంటే, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. అంటూ చెబుతాం. ఈ ఇద్దరు ఒక తరంలో అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సార్టు ఢీ కొన్నాయి. అందులో ఎవరు పై చేయి సాధించారు అనే విషయం పక్కన పెడితే, ఇద్దరు మంచి మిత్రులు అనేది మాత్రం నిజం. ఈ అగ్ర హీరోలు ఇద్దరు చాలా సార్లు ఒకే వేదికపై కనిపించారు. తాజాగా అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చడ్డా కోసం మళ్లీ చిరు, నాగ్ ఒకే వేదికపై కనిపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎప్పటిలాగే విభిన్నమైన కథతో లాల్ సింగ్ చడ్డా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 11న పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో బజ్ క్రియేట్ చేయడానికి మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు. మెగాస్టార్ ఏకంగా లాల్ సింగ్ చడ్డా సినిమాను సమర్పిస్తున్నాడు. అంతే కాకుండా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలకు కూడా వెళ్తున్నాడు. తాజాగా అమీర్ ఖాన్, చిరంజీవితో పాటు నాగ చైతన్య ను మా టీవీ వేదికగా కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశాడు.

దీని ప్రోమోలు కూడా టెలికాస్ట్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఇంటర్వ్యూపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రేజీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ పై ఎట్టకేలకు మా టీవీ స్పందించిందని సమాచారం. ఆగస్టు 7న రాత్రి 10 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుందని ఇండస్ట్రీలో వర్గాల్లో వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు