Chaitanya rao : స్టార్ హీరోల రేంజ్ లో బిజీ అయిన యూట్యూబ్ స్టార్?

చైతన్య రావు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో బాగా వినబడుతున్న పేరు. 30వెడ్స్ 21 అనే చిన్న యూట్యూబ్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన ఈ హీరో చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, అన్నపూర్ణ ఫోటో స్టూడియో తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఇతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రీసెంట్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా లో హీరోగా కూడా నటించాడు. ఓ మోస్తరు విజయం సాధించిన ఆ సినిమా కూడా చైతన్య రావు కి మంచి పేరు తెచ్చింది. ఇక చైతన్య రావు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.

చేసేవి చిన్న సినిమాలైనా, స్టార్ హీరోలను మించి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వాటిలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో నటిస్తున్న హనీమూన్ ఎక్స్ ప్రెస్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక కుమార్ స్వామి దర్శకత్వంలో నటించిన “షరతులు వర్తిస్తాయి” సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఇక లేటెస్ట్ గా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ‘పారిజాత పర్వం’ అనే సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తున్నాడు. సునీల్, శ్రద్ధా దాస్, వైవా హర్ష ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక చైతన్య రావు హీరోగా కాకముందు కొన్ని పెద్ద సినిమాల్లో అన్ క్రెడిటేడ్ రోల్స్ లో కూడా నటించాడు. అయితే ప్రస్తుతం హీరోగా మంచి ఆఫర్లే వస్తున్నా, నిలదొక్కుకోవాలంటే హిట్లు కూడా తప్పనిసరి. సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఒక్క మంచి హిట్ కొట్టినా ఈ హీరోకి మరో అరడజను సినిమాల ఛాన్సులు రావడం ఖాయం. ఎందుకంటే ఇండస్ట్రీ లో ఆటిట్యూడ్ చూపించే కొందరు హీరోల కన్నా, టాలెంట్ ఉండి, ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి రెడీ గా ఉండే ఇలాంటి నటులకు ప్లాపులు వచ్చినా అవకాశాలు పలకరిస్తూనే ఉంటాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు