Chaitanya Rao: యూట్యూబ్ స్టార్ లో మరో యాంగిల్.. “షరతులు వర్తిస్తాయి”…

టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో చైతన్య రావు ఒకడు. లాక్ డౌన్ లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ హీరో టాలీవుడ్ లో అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే కామెడీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ఇతని యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక కొన్ని నెలల కిందట తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమా తో ఆడియన్స్ ని పలకరించిన ఈ హీరో, తాజాగా “షరతులు వర్తిస్తాయి” అనే సినిమాతో హీరోగా వస్తున్నాడు.

లేటెస్ట్ గా సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో హీరో పేరు చిరంజీవి. ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ హీరోకి ఒక అమ్, తమ్ముడు, చెల్లి, ఇంకా ఒక హీరోయిన్.. ఇలా సింపుల్ గా చూపించేసి మధ్య తరగతి కుటుంబాల కష్టాలు, బరువు బాధ్యతలు కాస్త ఎంటర్టైనింగ్ గా చూపించాడు. ఇలా కాన్సెప్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి ఇవ్వనట్టు, పాత్రల్ని పరిచయం చేసి టీజర్ ని ఎండ్ చేసాడు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో హీరో కరీం నగర్ కి చెందిన కుర్రాడు కాబట్టి, పక్కా తెలంగాణ యాసలో పాత్రల్ని పరిచయం చేసిన విధానం బాగుంది. ఇక సినిమాలో ఎక్కువగా కొత్త వారినే యాక్టర్లుగా తీసుకున్నారు. అందువల్ల నార్మల్ కథే అయినా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఇక ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ లో శ్రీలత, నాగార్జున నిర్మిస్తుండగా, కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాని ఈ హీరోకి షరతులు వర్తిస్తాయి సినిమాతోనైనా మంచి హిట్ దక్కుతుందేమో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు