Rudrangi: ‘తల నరకుడు’…సెంటిమెంట్ పై గురి..!

ఈ మధ్య కాలంలో తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే బ్యాక్డ్రాప్ లో ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాలు సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా జులై 7న విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుండగా తాజాగా విడుదలైన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రుద్రంగి సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ ఏకంగా 8కట్స్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జగపతి బాబు తల నరికే సీన్ కూడా కట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ మధ్య కాలంలో తల నరకుడు సీక్వెన్స్ తో వచ్చిన దసరా, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వటంతో ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో 1960ల కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బూతుల స్థాయి శృతి మించినట్లు తెలుస్తోంది సెన్సార్ రిపోర్ట్ చూస్తుంటే.

‘ల’ కారంతో ఉన్న పలు డైలాగ్స్ కి కూడా సెన్సార్ కట్ చెప్పింది.దీన్ని బట్టి చుస్తే సినిమా ఎంత బోల్డ్ గా ఉండబోతుందో తెలుస్తోంది. రసమయి బాలకిషన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ దివి, విమలారామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, ఇటీవల కాలంలో అచ్చొచ్చిన తెలంగాణ నేపథ్యం, తల నరకుడు సీక్వెన్స్ తో రూపొందిన ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు