Amaran : ఈ సినిమాతో శివ కార్తికేయన్ మార్కెట్ రేంజ్ పెంచుకుంటాడా?

కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో పరిచయమై టాలీవుడ్ లో ప్రిన్స్ సినిమా చేసి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువయ్యాడు. కోలీవుడ్ నేచురల్ స్టార్ గా పేరున్న శివ కార్తికేయన్ ఈ పొంగల్ కి అయలాన్ తో వచ్చి మంచి హిట్ కొట్టగా, ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను లైన్లో పెట్టి కోలీవుడ్ లోనే బిజీ హీరో అయ్యాడు. ఇక తాజాగా శివ కార్తికేయన్ కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్న “అమరన్” మూవీ టీజర్ రిలీజ్ అయింది.

రాజ్ కుమార్ పెరియసామీ దర్శకత్వం వహిస్తున్న అమరన్ టీజర్ లో శివ కార్తికేయన్ కుమ్మేసాడని చెప్పొచ్చు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఆర్మీ జవాన్ గా నటిస్తున్నాడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టీజర్ సాలిడ్ రెస్పాన్స్ ని రాబట్టుకుంటుంది. టెర్రరిజం నేపథ్యంలో ఈ సినిమా ఉందని తెలుస్తుంది. ఇక టీజర్లో జివి ప్రకాష్ అందించిన బీజీఎమ్ కూడా బాగుంది. అయితే టీజర్ లో స్టోరీ కి సంబంధించిన అంశాలు పెద్దగా రివీల్ చేయలేదు.

ఇదిలా ఉండగా శివ కార్తికేయన్ ఒక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి చిన్న చిన్న సైడ్ రోల్స్ చేసి ఇప్పుడు హీరోగా ఒక్కో సినిమాతో తన రేంజ్ ని పెంచుకున్నాడు. రెండు మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిన శివ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన అయలాన్ తో తన క్రేజ్ కూడా చాటుకున్నాడు. దీనికి పోటీగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అయినా, అయలాన్ సినిమా భారీ వసూళ్లు సాధించి ఏకంగా కెప్టెన్ మిల్లర్ కంటే నాలుగు కోట్లు ఎక్కువగానే రాబట్టింది. ఇప్పుడు శివ కార్తికేయన్ పాన్ ఇండియా మూవీగా అమరన్ మూవీ తెరకెక్కుతుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ కావడంతో పాన్ ఇండియా మూవీకి కావాల్సిన స్టఫ్ ఈ సినిమాకుందని నెటిజన్లు భావిస్తున్నారు. అందువల్ల మేకర్స్ కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే ఈ సినిమాతో శివ కార్తికేయన్ మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని టాక్ నడుస్తుంది. అది నిజమే అయితే సినిమా మార్కెట్ రేంజ్ కూడా ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పొచ్చు. మరి రిలీజ్ టైం నాటికి అమరన్ పై ఏ రేంజ్ లో అంచనాలు పెరుగుతాయో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు