RaviTeja: జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న రవితేజ – కార్తీ హ్యాండ్ హిట్ ఇస్తుందా..?

మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ మీదున్న సంగతి తెలిసిందే. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ అందుకున్న రవితేజ ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ చవి చూసాడు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోయే రవితేజ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా టైగర్ నాగేశ్వరావు ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. రవితేజ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది ఈ సినిమా. రావణాసుర లాంటి డిజాస్టర్ తరువాత రాబోతున్న సినిమా కావటంతో ఈ సినిమా విషయంలో రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ పాత్రను పరిచయం చేయటం కోసం మలయాళంలో డుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ఇటీవలే యూనిట్ ప్రకటించింది.
తాజాగా తమిళ్ వర్షన్ కోసం హీరో కార్తీ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని యూనిట్ తెలిపింది. రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు