Rashmika: వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన రష్మిక – ఫిదా అవుతున్న నెటిజన్స్.!

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫర్హానా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ ను మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, పుష్ప సినిమాలో శ్రీవల్లి లాంటి పాత్రలకు తాను సరిగ్గా సూట్ అవుతానని కామెంట్ చేసింది. అయితే, రష్మిక కంటే తానే శ్రీవల్లి పాత్రకు సూట్ అవుతానని ఐశ్వర్య అన్నట్టుగా రష్మిక అభిమానులు అర్థం చేసుకొని సోషల్ మీడియాలో ఐశ్వర్యను ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. జరుగుతున్న డ్యామేజ్ ని గమనించిన ఐశ్వర్య తన వైఖ్యలకు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.
తన వ్యాఖ్యల వెనక రశ్మికను కించపరిచే ఉద్దేశ్యం లేదని, శ్రీవల్లి లాంటి పాత్రలకు తాను సూట్ అవుతానన్న అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని వివరణ ఇచ్చింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక చక్కగా నటించిందని చెప్పుకొచ్చింది. రష్మిక పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఐశ్వర్య రిలీజ్ చేసిన నోట్ లో వివరణ ఇచ్చింది. ఐశ్వర్య వివరణకు కాస్త ఆలస్యంగా స్పందించినా కానీ, హుందాగా స్పందించింది రష్మిక.
ఐశ్వర్య టీం పోస్ట్ చేసిన కామెంట్ కి స్పందించిన రష్మిక “హాయ్ లవ్, ఇది నేను ఇప్పుడే చూసా. నీ ఉద్దేశం ఏంటో నాకు నాకు బాగా తెలుసు, మనలో మనకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని” రిప్లై ఇచ్చింది. నాకు నీ పట్ల ఎప్పుడు ప్రేమ, గౌరవం ఉంటాయని చెప్పిన రష్మిక ఫర్హానా సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలియజేసింది. రష్మిక నుండి ఇలాంటి హుందాతనం నిండిన స్పందన రావటం పట్ల అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య ఎంత హుందాగా వివరణ ఇచ్చిందో రష్మిక కూడా అంతే హుందాగా రిప్లై ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు