Tollywood: హిట్టొచ్చి నెలయ్యింది. మళ్ళీ ఎప్పుడు?

టాలీవుడ్ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతుంది. కొన్నాళ్ల వరకు వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ ని సైతం బెదరగొట్టిన మన సినిమాలు ఇప్పుడు ఒక్క హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో అత్యధిక సినిమాలు తీసే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది. అలాంటిది తెలుగు తెర మళ్ళీ నిఖార్సైన హిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. 2023 సంక్రాంతికి రెండు వరుస హిట్లతో స్టార్ట్ చేసిన టాలీవుడ్ విజయ పరంపర విరూపాక్ష వరకు సాగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగులో హిట్టు సినిమా పడలేదు.

ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష విడుదలై మౌత్ టాక్ తో ఘన విజయం సాధించింది. దాదాపు 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉన్న ఈ సినిమా ఇప్పటికి కొన్ని సెంటర్లలో బాగా ఆడుతుంది. అయితే ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా మళ్ళీ హిట్ గీత దాటలేదు సరికదా?, కనీసం యావరేజ్ సినిమా కూడా రాలేదు. విరూపాక్ష తర్వాత వరుస బెట్టి వారానికి 3,4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏజెంట్, రామబాణం, ఉగ్రం, భువన విజయం, కస్టడీ, కథ వెనుక కథ, ఇలా అన్ని సినిమాలు ఇలా రిలీజ్ అయి అలా వెళ్లిపోయాయి. తాజాగా వచ్చిన “అన్ని మంచి శకునములే” చిత్రం కూడా నెగిటివ్ టాక్ తో ప్లాప్ దిశగా పరుగులు పెడుతుంది.

ఇప్పటికే తెలుగులో హిట్ వచ్చి నెల దాటింది. ఇప్పుడు వచ్చేవారం విడుదల అవుతున్న సినిమాలు కూడా చెప్పుకోదగ్గ సినిమాలు కాదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ కి సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ పడాలి. అది బహుషా ఆది పురుష్ వల్లే అవుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు విడుదలయ్యే సినిమాల్లో ఏ సినిమాకు మినిమం బజ్ కూడా లేదు. పైగా ఐపీఎల్ 2023 రసవత్తరంగా ఉండడంతో వస్తున్న సినిమాలు కొంచెం యావరేజ్ గా ఉన్నా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ హిట్ గీత దాటాలంటే అది పెద్ద సినిమాతోనే సాధ్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు