బావ జైలుకి.. బామ్మర్దికి బాధ్యత.. మరి సినిమా?

 

టాలీవుడ్ లో కొందరు హీరోల సినిమాలు గత కొన్నాళ్లుగా రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. కొందరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండడం వల్ల వారికి అలాంటి ఇబ్బందులు వస్తుంటే, మరికొందరికి పరోక్షంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఇక మొన్నామధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకి అధికార పార్టీ నేతలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసారో తెలిసిందే.

ఇక తాజాగా టీడీపీ నేత చంద్రబాబు నాయుడుని ఎదో స్కాం పేరిట సిబిఐ అరెస్ట్ చేయగా, రెండు రోజులుగా తిప్పుతూ, ఇప్పుడు తాత్కాలికంగా జైలుకి కూడా పంపే యోచనలో ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో టీడీపీ పార్టీని నడిపించే బాధ్యతని అయన బావ నందమూరి బాలకృష్ణ తీసుకున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో పార్టీని నడపడం కోసం ఆయన చేసే పని తప్పే కాదు. కానీ బాలకృష్ణ నటిస్తున్న సినిమాల పనే అదోగతిగా మారింది.

- Advertisement -

ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి, అలాగే బాబీ సినిమాలు పెండింగ్ లో పడ్డాయి. బాబీ డైరెక్ట్ చేసే సినిమా అసలు సగం కూడా పూర్తి కాలేదు కాబట్టి దానికోసం ఆగినా పర్లేదు. కానీ షూటింగ్ చివరి దశలో ఉన్న భగవంత్ కేసరి సినిమాకి డేట్స్ కేటాయించకపోతే దసరా రిలీజ్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. మరి ఈ లోపు చంద్రబాబు బయటికి వస్తేనే బాలయ్య మళ్ళీ సినిమాల వైపు తన దృష్టి పెట్టె అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుద్దో.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు