Prabhas: సలార్ కే దిక్కులేదంటే ఆ సినిమాని సంక్రాంతికి తెస్తారట?

Prabhas:

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కుతున్న సినిమాల్లో సలార్, కల్కి2898 లు కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో కావడం విశేషం. అయితే ఈ సినిమాలు అనౌన్స్ అయ్యి మూడేళ్లు దాటినా, కార్యరూపం దాల్చడానికై ఏడాది పట్టింది. ఇక ఈ సంవత్సరం శరవేగంగా రెండు సినిమాలు షూటింగ్ చేస్తూ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. ముందుగా సలార్ ని సెప్టెంబర్28న రిలీజ్ అని ప్రకటించగా, ఆ డేట్ ని వాయిదా వేసారు.

అయితే కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు చిత్ర యూనిట్. పైగా సలార్ ఖచ్చింతంగా ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. అయితే సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు కానీ, ప్రభాస్ నటిస్తున్న , మరో సినిమా కల్కి ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని వైజయంతి మూవీస్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం వరకు బాకీ ఉన్నా, ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా పూర్తి చేద్దామని నాగ్ అశ్విన్ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే షూటింగ్ మొత్తం పూర్తయినా రిలీజ్ డేట్ కోసం సతమతమవుతూ, కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న సలార్ మేకర్స్ పరిస్థితే ఇంకా ఏం తెలియట్లేదు. సినిమాని దీపావళికి తెద్దామా, లేక క్రిస్మస్ కి తెద్దామా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారు సలార్ మేకర్స్. మరి సలార్ రిలీజ్ కాకుండా కల్కిని ఎలా థియేటర్లలోకి తెస్తారు అని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు